![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -416 లో.... మాయని తీసుకొని కావ్య రాగానే.. అందరు షాక్ అవుతారు. నువ్వు చేసిన ఘనకార్యం గురించి చెప్పమని మాయతో కావ్య అంటుంది. ఈ ఇంట్లో ఇన్ని గొడవలు రావడానికి గల కారణం నేనే అని తెలిసింది. ఆ బిడ్డకి జన్మనిచ్చిన తల్లిని నేనే అని మాయ అనగానే.. మరి తండ్రి ఎవరని రుద్రాణి అడుగుతుంది. రాజ్ అంటూ తన వైపు చూపిస్తుంది మాయ. దాంతో కావ్య, సుభాష్, రాజ్ ఆశ్చర్యంగా చూస్తారు.
ఎవరు నన్ను నీలదియ్యక ముందే నేనే నిజం బయటపెడతానంటూ రాజ్ పరిచయం అయ్యాడు.. అనుకోకుండా నేను ప్రెగ్నెంట్ అయ్యాను.. రాజ్ నన్ను మోసం చెయ్యడన్న నమ్మకంతో బిడ్డకి జన్మనిచ్చాను. ఇంత పెద్ద కుటుంబంలోకి నన్ను తీసుకొని రావడం రాజ్ కి ఇష్టం లేదు. కానీ నా బిడ్డకి న్యాయం చెయ్యమని వేడుకున్నను అందుకే నా బిడ్డని తీసుకొని వచ్చాడు. కానీ ఇప్పుడు కావ్య జరిగిందంతా చెప్పి నన్ను తీసుకొని వచ్చింది. న్యాయం చేస్తానని చెప్పిందని మాయ చెప్తుంది. రాజ్ ని కావ్య ఎంత నమ్మిందో.. సవతి బిడ్డని నీ బిడ్డలాగా చేసుకున్నావంటూ కావ్యని రుద్రాణి అంటుంది. కావ్యని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ బిడ్డకి తల్లి ఎవరో తెలిసింది కదా ఎవరికి న్యాయం చేస్తారు ఇక చెప్పండి.. కావ్యకి అన్యాయం చేస్తారా చెప్పండి అని ధాన్యలక్ష్మి అనగానే... కావ్యనే తనకి తాను అన్యాయం చేసుకుంది. తన భర్తతో సంబంధం పెట్టుకున్న స్త్రీని తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఆ మాయకే ఈ ఇంట్లో స్థానం ఉంటుందని రుద్రాణి అంటుంది. దాంతో స్వప్న కోప్పడుతుంది.
ఇక ఆ మాటలు విని రుద్రాణిని ఇందిరాదేవి తిడుతుంది. రాజ్ భార్య స్థానం గురించి ప్రశ్నించాల్సిన అవసరం లేదని ఇందిరాదేవి అంటుంది.ఇప్పుడు ఈ సిచువేషన్ లో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్ కాదు.. సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ అమ్మాయిని మన ఇంట్లో ఉండనిద్దామని సీతారామయ్య చెప్తాడు. ఆ తర్వాత రాజ్, సుభాష్ లు ఎందుకు ఇలా చేసావంటూ కావ్య ని అడుగుతారు. అసలు మాయ ఎక్కడ? ఇది ఎవరని రాజ్ అడుగుతాడు. అసలు మాయ అడ్రెస్ పంపంచాను కదా.. ఈ మాయ ఎవరని సుభాష్ అంటడు. ఆ తర్వాత కావ్య జరిగిందంతా చెప్తుంది. ఇదంతా నావల్లే ఈ అమ్మాయి మాయ అని ఎందుకు నమ్మించిందో తెలుసుకుంటాను. నువ్వు చేసింది చాలని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో రుద్రాణి, మాయ ఇద్దరు మాట్లాడుకుంటారు. యాక్టింగ్ బాగా చేసానా అని మాయ అడుగుతుంది. బాగా చేసావని రుద్రాణి అంటుంది. మమ్మీ నాకు తెలియకుండా ఇదంతా ప్లాన్ చేసావా.. ఈ అమ్మాయి మాయ కాదా అని రాహుల్ అంటాడు. కాదు ఈ మమ్మీని తక్కువ అంచనా వేసావని రుద్రాణి అనగానే.. అవును చాలా తక్కువ అంచనా వేసానని కావ్య అంటుంది. దాంతో మాయ, రుద్రాణి ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |